దేశ భద్రతపై ప్రధాని మోదీ సమీక్ష..

67
- Advertisement -

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రతా సన్నద్ధతను ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులతో ప్రధాని పలు పర్యాయాలు మాట్లాడడం, శాంతికి కట్టుబడి ఉండాలని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించడం తెలిసిందే.

ప్రధాని నిర్వహించిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శృంగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. ర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో దేశ భ‌ద్ర‌త‌, ప్ర‌పంచ ప‌రిణామాల‌పై ఈ స‌మావేశం లోతుగా చ‌ర్చించ‌నుంది.

- Advertisement -