ఆసుప‌త్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్..

185
- Advertisement -

సీఎం కేసీఆర్ య‌శోద‌ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి కేసీఆర్ నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. వైద్య ప‌రీక్ష‌లు ముగిసిన అనంత‌రం కేసీఆర్‌ను కాసేపు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి డిశ్చార్జి చేశారు. ఈరోజు ఉద‌యం కాస్త అనారోగ్యంగా అనిపించ‌డంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు య‌శోద ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఎడ‌మ చేయితో పాటు కాలు కూడా లాగుతున్న‌ట్లుగా ఉంద‌ని కేసీఆర్ చెప్ప‌డంతో ఆయ‌న‌కు గుండె సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా? అన్న‌ కోణంలో య‌శోద ఆసుప‌త్రి వైద్యులు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు చేశారు.

యాంజియోగ్రామ్‌తో పాటుగా సిటీ స్కాన్‌, ఈసీజీ త‌దిత‌ర ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల అనంత‌రం కేసీఆర్‌కు ఎలాంటి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని య‌శోద ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రికి సూచించామ‌ని వైద్యులు తెలిపారు.

- Advertisement -