దళితబంధుకు రూ.17,700 కోట్లు

46
harish
- Advertisement -

2 లక్షల 56 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి హరీష్ రావు. 3వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన హరీష్‌…అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు నిలవనుందన్నారు. ఈ పథకం కోసం రూ.17,700 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని…బ్యాంకు లింకులు లేవు. నిబంధనలు లేవు అన్నారు.

ఆస‌రా పెన్ష‌న్ల‌కు రూ. 11,728 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. సడ‌లించిన వ‌యోప‌రిమితి ప్ర‌కారం కొత్త ల‌బ్ధిదారుల‌కు ఆస‌రా పెన్ష‌న్లు ఇస్తామన్నారు.
క‌ల్యాణ‌లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

వ్య‌వ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపిన హరీష్‌…పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 2.5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు ల‌క్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హ‌రిత‌హారానికి రూ. 932 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేస్తామన్నారు. రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీ,పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ,ఈ ద‌ఫా 5.12 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణాలు మాఫీ చేస్తామన్నారు.

- Advertisement -