- Advertisement -
సీఎం కేసీఆర్ జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకునేందుకు, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ. 10 లక్షల చెక్కులను అందజేయనున్నారు.
ఇవాళ ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లినున్న సీఎం కేసీఆర్….. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీకానున్నారు.ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం ఉంది.ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం.. మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టనున్నారు.
చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Advertisement -