- Advertisement -
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి సీఆర్ సంకల్పం మేరకు తెలంగాణ సర్కార్ రెండు పడకల ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారేడ్ పల్లిలో ₹36.27 కోట్లతో నిర్మించిన 468 ఇండ్లను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సీహెచ్ మల్లా రెడ్డి, శ్రీ మహమూద్ అలీ లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ సాయన్న, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత రెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -