సినీ పరిశ్రమకు అండగా సీఎం కేసీఆర్..

56
ali
- Advertisement -

టాలీవుడ్‌కు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు హోంమంత్రి మహమూద్ అలీ. సదా నన్ను నడిపే సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న మహమూద్ అలీ…సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ చాలా అనుకూలం అన్నారు.

మా ప్రభుత్వం సినీ పరిశ్రమకి పూర్తి అండగా ఉంది. వచ్చే ఐదేళ్లలో చిత్ర నిర్మాణంలో హైదరాబాద్ దేశానికి మరో ముంబయిలా మారుతుందన్నారు. చిత్రపరిశ్రమకు సీఎం కేసీఆర్‌ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.

గత కొన్ని నెలలుగా టికెట్ రేట్ల పెంపు అంశంపై ఏపీలో సినీ పరిశ్రమకు- అక్కడి ప్రభుత్వానికి మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -