ట్రాఫిక్ చలాన్‌…ఒక్కరోజే రూ.5.5 కోట్ల ఆదాయం

96
police
- Advertisement -

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న చలాన్ల చెల్లింపు కోసం పోలీసు శాఖ ప్రత్యేక రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుండి 31 వరకు ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై రాయితీ ప్రకటించగా తొలిరోజు మంచిస్పందన వచ్చింది. నిమిషానికి 700 మంది పెండింగ్ చలాన్లు చెల్లించగా ఓ దశలో ట్రాఫిక్ చలాన్ చెల్లించేందుకు ఎక్కువమంది రావడంతో సైట్‌ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది.

ఇక తొలిరోజు 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్‌లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలిరోజు రోజు లక్ష నుంచి 3 ల‌క్షల మంది వరకు వాహ‌న‌దారులు ట్రాఫిక్‌ ఛలాన్‌లు చెల్లిస్తారని పోలీసులు భావించారు కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 5 లక్షలకు పైగా పెండింగ్ ఛలాన్‌లు క్లియ‌ర్ అయిపోయాయి. దీంతో పోలీస్ శాఖ‌కు ఏకంగా రూ.5.5 కోట్ల మేర ఆదాయం ల‌భించింది.

హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల పై చిలుకు ట్రాఫిక్ ఛలాన్‌లు పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు రిబేట్ ప్రకటించారు.

- Advertisement -