- Advertisement -
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై సీఎం కేసీఆర్ ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు కానున్నారు.
పొలిటికల్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ కసరత్తుతో పాటు ఏ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారనే తేదిని ఖరారు చేయనున్నారు. అనంతరం అమోదం కోసం గవర్నర్ తమిళి సైకి పంపనున్నారు.
- Advertisement -