కాంగ్రెస్ నేత కుటుంబానికి అండగా కేసీఆర్ సర్కార్..!

117
kcr cm
- Advertisement -

తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. రైతుబంధు పథకం కింద ప్రతి ఎకరానికి ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తుండడంతో అన్నదాతలకు పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన ఆగత్యం తప్పింది. దీంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తప్పింది. ఇక రైతు బీమా పథకం కింద రైతు మరణించిన వారం రోజుల్లోకే వారి కుటుంబానికి కేసీఆర్ సర్కార్ రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ భరోసాగా నిలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా అందరికీ రైతుబంధు, రైతు బీమా పథకం అమలు చేస్తోంది.

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కాదనకుండా తీసుకుంటున్న ఈటల రాజేందర్ , రేవంత్ రెడ్డి వంటి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఉల్టా రైతుబంధు పథకంతో బడాభూస్వాములకు ప్రభుత్వం దోచిపెడుతుందంటూ ఆరోపణలు చేస్తుంటారు. రైతు బీమాను టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారంటూ చవకబారు విమర్శలకు దిగుతున్నారు. అయితే తాజాగా ఓ కాంగ్రెస్ నేత కుటుంబానికి రైతుబీమా పథకం భరోసానిచ్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేట ఎంపీటీసీ డబ్బు జగన్మోహన్‌రెడ్డి భార్య లక్ష్మి 22 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది.

ఆమె పేరిట వ్యవసాయ భూమి ఉండటంతో రైతుబీమా కింద రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ శనివారం మంజూరుపత్రాన్ని జగన్మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం.. పార్టీలు, వర్గాలకతీతంగా పథకాలను వర్తింపజేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా రైతు బీమాతో తమ పార్టీ నేత కుటుబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నింటినీ అన్ని పార్టీల్లోని అర్హులైన నాయకులు, కార్యకర్తలకు అందిస్తున్న నిష్ప్రక్షపాత పాలకుడు సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు కొనియాడుతున్నరు. మరి సీఎం కేసీఆర్‌ను పొగిడినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతలపై ఎలా చిందులేస్తారో చూడాలి.

- Advertisement -