సిరిసిల్లలో భారీ పెట్టుబడి.. కేటీఆర్ సమక్షంలో ఒప్పందం..

78
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మరియు టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈ రోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. ఎంఓయూ ప్రకారం, సిరిసిల్లలో 7.42 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అపెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్ట్ కంపెనీ తమ అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది.

టెక్స్‌పోర్ట్ కంపెనీ మొదట 800 మెషీన్లను ఏర్పాటు చేసి సుమారు 1600 మందికి ఉపాధి కల్పించనున్నది. మూడు సంవత్సరాల వ్యవధిలో సుమారు 2000 మందికి ఉపాధి కల్పించే విధంగా 1000 మెషీన్లకు విస్తరించనుంది.

- Advertisement -