బీజేపీ నేతల బండారం బట్టబయలు..!

108
- Advertisement -

తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటికి కేంద్రమే నిధులు ఇస్తుందంటూ…బండి సంజయ్, అరవింద్‌, కిషన్ రెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి బీజేపీ నేతలు బడాయి కబుర్లు చెబతుంటరు..ఆఖరకు అవ్వాతాతలకు కేసీఆర్ ఇస్తున్న రూ. 2016 రూపాయిల ఆసరా పింఛన్‌లో కూడా వేయి రూపాయిలు మాయే…కేసీఆర్ కిట్లలో కింద ఇస్తున్న 12 వేలల్లో ఆరువేలు మావే అంటూ తెలంగాణ బీజేపీ నేతలు పదేపదే గప్పాలు కొడుతుంటరు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో పింఛన్లకు కేంద్రమే డబ్బులు ఇస్తుందంటూ బండి బ్యాచ్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ విఫలం అయిందనే చెప్పాలి. అయితే అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సర్కార్ భారీగా ఫింఛన్లు ఇస్తున్న ఘనత కేసీఆర్ సర్కార్‌కే దక్కుతుంది. పింఛన్ల కింద కేంద్రం ఇచ్చే డబ్బులు కేవలం 200 మాత్రమే…ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్వయంగా అంగీకరించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రూ. 200 పింఛన్‌ను రూ. 1000 చేస్తున్నట్లు నడ్డా ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. దీంతో కేంద్రం దేశవ్యాప్తంగా పింఛన్లకు ఇచ్చేది కేవలం 200 మాత్రమే అని తేలిపోయింది.

ఈ క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్లకు కూడా కేంద్రం ఇస్తుంది 200 మాత్రమే అని తేలిపోయింది…ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌ నగరంలో భారీ వరదలు సంభవించాయి. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగకపోయినా….ఆస్తినష్టం భారీగా జరిగింది. కాగా గుజరాత్‌లో వరద విపత్తు కింద తక్షణ సాయంగా వేల కోట్లు ప్రకటించిన మోదీ సర్కార్ హైదరాబాద్‌కు మాత్రం ఒక్క రూపాయి విదిలించింది లేదు..పైగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరద సాయంగా ఎన్డీఆర్ఎఫ్ నిధుల కింద తెలంగాణకు రూ. 200 కోట్లు హైదరాబాద్‌కు తెచ్చామని, మరి కొందరు బీజేపీ నేతలు రూ. 500 కోట్లు తెచ్చామని అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, యువనేత క్రిశాంక్ లైవ్‌లో పింఛన్లు, వరద సహాయ నిధుల విషయంలో బండి బ్యాచ్ చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని మీడియా లైవ్‌ డిబెట్ సాక్షిగా నిరూపించారు. మణిపూర్ ఎన్నికల కోసం 200 రూపాయిల పెన్షన్ ని రూ. 1000 రూపాయిల వరకు పెంచుతామని చెప్పే బీజేపీ దేశమంతా ఎందుకు పెంచడం లేదని క్రిశాంక్ నిలదీశారు.

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఇస్తున్న రూ. 2016 రూపాయల ఫించన్‌లో కేంద్రం వాటా వేయి రూపాయలు అని చెప్పుకుంటున్న బీజేపీ నేతల బండారాన్ని క్రిశాంక్ బయటపెట్టేసారు. అలాగే వరదసాయం కింద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు రూ. 500 కోట్లు తెచ్చానని చెప్పుకోవడం కూడా బూటకమే అంటూ జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ వివిధ రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల జాబితాను మీడియా లైవ్‌లో చదవించి బీజేపీ ప్యానల్‌లో ఉన్న నేతకు కౌంటర్ ఇచ్చారు. గుజరాత్‌తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు కేటాయించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు జాతీయ విపత్తు నిధి కింద ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆ జాబితాలో వెల్లడైంది. దీంతో జర్నలిస్ట్ బీజేపీ ప్యానల్‌లో ఉన్న మహిళా నేతను నిలదీయడంతో ఆమె నీళ్లు నములుతూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా పింఛన్లు, వరద సాయం విషయంలో బండి బ్యాచ్ చెబుతున్నవన్నీ బడాయి కబుర్లే అని టీఆర్ఎస్ నేత క్రిశాంక్ లైవ్‌లో సాక్ష్యాలతో సహా బయటపెట్టడంతో బీజేపీ మహిళా నేత దెబ్బకు నోరు మూసుకుకోవాల్సి వచ్చింది.

- Advertisement -