అల్లం నారాయణ సతీమణి మృతి..

300
- Advertisement -

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి చెందారు.. కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె గత 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో 20 రోజుల క్రితం నిమ్స్లో అడ్మిట్ చేశారు. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించకపోవడంతో కన్నుమూశారు.

అమ్మల సంఘం అధ్యక్షురాలుగా ఉన్న పద్మ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షించారు. ప‌లువురు రాజకీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -