ఈ రోజు మంత్రి హరీష్ రావు బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్-సెస్ లో విద్యార్థినుల వసతి గృహానికి శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సెస్ ఫౌండర్ మెంబర్లు మహేందర్ రెడ్డి, జిఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సెస్ ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తున్నదన్నారు. జాతీయ స్థాయిలో ఇక్కడి పీహెచ్‌డీ కోర్సుకు డిమాండ్ ఉంది. వివిధ రాష్ట్రాల నుండి చేరుతున్నారు. వీరి అవసరాల నిమిత్తం రు. 5 కోట్లతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నారు. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుంది. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుంది. రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో మరింతగా కలిసి పని చేద్దాం అన్నారు మంత్రి.