బీ టౌన్‌…నిరాశపర్చిన ఖిలాడి

85
rt
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. సత్య నారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు మరియు హిందీ భాషల్లో రిలీజ్ కాగా బాక్సాఫీస్ ముందు ఈ సినిమా బోళ్తా పడింది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా రవితేజ సరసన నటించారు.

సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరించగా శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ అందించారు. రవితేజ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పెన్ ఇండియా….. ఖిలాడీ హిందీ డ‌బ్బింగ్ రైట్స్ (Hindi dubbing rights) ను రూ.20 కోట్ల‌కు ద‌క్కించుకుంది. అయితే తాజా అప్ డేట్ ప్ర‌కారం ఖిలాడీ హిందీ వెర్ష‌న్ కు క‌లెక్ష‌న్లు జీరోన‌ట‌. స్పంద‌న మాత్రం క‌రువ‌వ‌డంతో హిందీలో ప్లాప్ ను మూట‌గ‌ట్టుకుంది. యూట్యూబ్ ఛాన‌ల్ లో కూడా హిందీ వెర్ష‌న్ మార్కెట్ చేయ‌లేక‌పోయింది.

- Advertisement -