తన పాటతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ..సినీ ఇండస్ట్రీలో సింగర్ గా తనకంటూ ఓ క్రేజ్ ని సంపాధించుకుంది సుచిత్ర. కేవలం పాటలతోనే కాదు..తన స్టెప్పులతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది సుచిత్ర. అయితే సుచికి సింగర్ గా అంత పేరు రావడం వెనుక తమన్, దేవిశ్రీప్రసాద్ లు ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే సుచి ఎక్కువగా పాటలు పాడింది వీరి సంగీత సారథ్యంలోనే.
అయితే వీరిద్దరి సారథ్యంలో సింగర్ గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సచిత్ర కెరియర్ ఇప్పుడు మాత్రం ప్రమాదంలో పండింది. దీనికి కారణం సుచిత్ర ట్విట్టర్ అకౌంట్స్లోంచి కొంతమంది సినిస్టార్ల రొమాన్స్ ఫొటోలు, న్యూడ్ వీడియోలు లీక్ అవడమే. నిజానికి సుచి తనకు తానుగానే ఆ ఫొటోలని లీక్ చేసిందా? లేక తన ట్విట్టర్ అకౌంట్ ని ఎవరైనా హ్యాక్ చేసి అవన్నీ లీక్ చేస్తున్నారా అనేది ఇప్పటివరకూ తెలియదు.
అయితే సుచి అకౌంట్ హ్యాకే అయిందో లేక సుచిత్ర మానసికంగా కృంగిపోయిందో, నిజంగా ప్రపంచం మీద విరక్తే వచ్చిందో, కారణం ఏమైనా కానీ సుచిత్ర ప్రస్తుతం ఇబ్బందుల్లో వుందన్న విషయం వాస్తవం. ఇక ఇదే టైంలో.. తనకిక్కడ అవకాశాలే కాదు.. అసలు ఇక్కడ వుండే అవకాశమే లేదని కూడా కొంతమంది అంటున్నారు.
ఈ విషయంలో సుచిత్రకి మద్దతుగా తనకి తెలిసిన గాయనీమణులు మాట్లాడుతున్నారు. గీతామాధురి అయితే సుచిత్రకి మనోస్థైర్యం ఎక్కువ అని, ఆమె చిన్నవాటికి కృంగిపోయి మనసు విరిచేసుకోదని, ఎక్కడో ఏదో జరిగి వుంటుందని, దానిని కనిపెట్టాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించింది.
అయితే సుచిత్రని ఇంత ఓపెన్‌గా సమర్ధించిన వాళ్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ. కానీ ఇంత జరుగుతున్నా.. తమన్, దేవిశ్రీప్రసాద్ లు సుచిత్రకి అంత సన్నిహితులై వుండి కూడా వీరు సుచికి సంఘీభావం ఎందుకు తెలపడం లేదు? అనే అనుమానాలు అభిమానుల్లో ఇప్పటికే మొదలయ్యాయి.
అయితే ఇప్పటివరకూ..సుచి విషయంలో స్పందించని వీరు.. అసలు ఇదంతా ఎలా జరిగింది అని ఆరా తీసి..సుచికి, తన కెరియర్‌కి ఎలాంటి ప్రమాదం లేదనే భరోసా తనకిస్తారా? అనేది ప్రశ్నార్ధకం..! ఏదేమైనా సుచి విషయంలో సపోర్ట్ గా నిలుస్తున్నవారికి వీరిద్దరు కూడా తోడవుతారో లేదో చూడాలి..!