‘ఆచారి అమెరికా యాత్ర’…

256
Vishnu Manchu 'Achari America Yatra' Movie Announcement
- Advertisement -

“దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం” లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల క్రేజీ కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు చౌదరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న డా.మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా “ఆచారి అమెరికా యాత్ర” చిత్ర ప్రారంభోత్సవం తిరుపతిలో జరగనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “దర్శకులు నాగేశ్వర్రెడ్డి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. మల్లిడి వెంకటకృష్ణ మూర్తి ఈ చిత్రానికి కథను సమకూర్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రం షూటింగ్ మేజర్ పార్ట్ అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందంల కాంబినేషన్ విశేషంగా అలరిస్తుంది. మార్చి 19న లాంఛనంగా సినిమా మొదలవుతుంది. నటీనటులు మరియు ఇతర సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. ప్రారంభోత్సవం కల్లా మిగిలిన వివరాలు వెల్లడిస్తాం” అన్నారు.

- Advertisement -