సీఎం కేసీఆర్ నిర్ణయం మాకు మరింత బలం..

64
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకువస్తున్న పలు విధానాలపై సీఎం కేసీఆర్ తీసుకున్న స్టాండ్‌ను మా విద్యుత్ ఉద్యోగులకు హర్షణీయమన్నారు నేషనల్ విద్యుత్ ఇంజనిర్స్ సెక్రటరీ జనరల్ రత్నాకర్ రావు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడం,సోలార్ పవర్‌ను ప్రోత్సహించడంను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొం అనడం మేము స్వాగతిస్తున్నాం. విద్యుత్ ఉద్యోగులు, విద్యుత్ ఇంజనీర్లు అందరం మేము పోరాటం చేశాం.దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ తీసుకుందో తెలంగాణ తోపాటు మరో 13 రాష్ట్రాలు స్టాండ్ తీసుకోవడం మేము స్వాగతిస్తున్నామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విధానాలపై మేము మరింత పోరాటం చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తాం. అన్ని రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగులను కలుపుకొని త్వరలోనే బారి బహిరంగ సభ పెడుతాము. మోటర్లకు మీటర్లు పెట్టడం వలన వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతారని అన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ బాటలోనే అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మా విద్యుత్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అండగా రావడం మరింత బలం చేకూరింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ సంస్కరణలు ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కానివ్వమని వ్యాఖ్యానించారు.

పవర్ ఇంజెనిర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సదానందం మాట్లాడుతూ.. విద్యుత్ వ్యవస్థ కాపాడుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిన మాటలు మాకు సంతోషాన్ని ఇచ్చాయి. సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం అనడం హర్షించదగ్గ విషయం అన్నారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ ఇంజనీర్లు,ఉద్యోగులను కలుపుకొని ముందుకు పోతాం. త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులతో రాష్ట్రంలో బారి బహిరంగ సభ పెడుతామన్నారు. విద్యుత్ వ్యవస్థ కాపాడడానికి సీఎం కేసీఆర్ నిన్న చేసిన ప్రకటనతో చాలా రాష్ట్రాల ఉద్యోగులు ఫోన్ చేస్తున్నారు. సీఎం మద్దతు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.

- Advertisement -