అర్హులందరికీ డ‌బుల్ బెడ్రూం ఇండ్లు: కేటీఆర్

40
ktr
- Advertisement -

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. ముస్తాబాద్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్నాయా? ద‌మ్ముంటే చూపించాల‌ని ప్ర‌తిప‌క్షాల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.

రూ.18 వేల కోట్ల‌తో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని తెలిపారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణం అనే తేడా లేకుండా.. పేద‌లు ఉండే ప్రాంతాల్లో ఈ ఇండ్లు నిర్మిస్తున్నాం. ముస్తాబాద్‌లో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామ‌న్నారు. రాజ‌కీయాల‌కు తావు లేకుండా అర్హులైన వారికి ఇండ్లు కేటాయిస్తున్నాం. కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయన్నారు.

రైతుబంధు, క‌ల్యాణ‌లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఉండే అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నా. కేసీఆర్ మొండి మ‌నిషి. ఆయ‌న ఏ ప‌ని చేప‌ట్టిన పూర్త‌య్యేదాకా వ‌ద‌ల‌రు.. కాబ‌ట్టి ప్ర‌తీ పేద వ్య‌క్తికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తార‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -