మరణాన్ని మించిన సత్యం మరేదిలేదు..గానకోకిల చివరిమాటలు

77
latha
- Advertisement -

మరణాన్ని మించిన సత్యం మరేదిలేదని గానకోకిల లతామంగేశ్కర్ తన చివరి మాటలను తెలిపారు. ఓ తమిళ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా సోషల్ మీడియాలో లతా మంగేష్కర్ చివరి మాటలు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్‌గా మారింది.ఆ పత్రికలో వచ్చిన అనువాదం యాదతథంగా…మరణాన్ని మించిన సత్యం మరేది లేదు.. అత్యంత విలువైన బ్రాండ్ కారు నా ఇంటి గేరేజ్ లో వుంది. నేనుచక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి వున్నాయి. కాని ఆస్పత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని వున్నాను.నా బ్యాంకు అక్కౌంట్ లో డబ్బు చాలానే వుంది. కాని నాకు ఏది వుపయోగం లేదు. నా ఇల్లు ఒక రాజభవనం లా వుంది కాని నేను ఆస్పత్రిలో ఒక చిన్న పడక మీద వున్నాను. ప్రపంచంలో వున్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటికి ప్రయాణం చేసేదాన్ని. ఆస్పత్రిలో ఆ టెస్టు కి యీటెస్ట్ కి లేబ్ లుకి మారి మారి వెడుతున్నానని అని తెలిపారు.

ఆనాడు నిత్యం శిరోజాలంకరణలవారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరసు పై శిరోజాలే లేవు..ప్రసిద్ధి చెందిన హోటల్స్ లోని ఆహారం తింటూ వుండేదానిని. కాని ఈనాడు పగలు రెండు మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు …ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని. కాని నేడు ఆస్పత్రి వరండా దాకా వెళ్ళడానికి ఇద్దరు అటెండర్ లు సాయం చేస్తున్నారు. ఏ సంపదా,వసతులు ఏవీ నాకు సహాయ పడలేదన్నారు.

ఏ విధమైన ఓదార్పునివ్వలేదు. సహాయపడలేదు. కాని కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత,వారి ప్రార్ధనలు..నాకు జీవం పోస్తున్నాయి…ఇంతేనండి యీ జీవతం..ఎవరికి సహాయం చేయలేని ధనం, పదవి వున్న వారికే విలువ యివ్వకండి..మంచి మనసు వున్న వారికి విలువనిచ్చి ,స్నేహం, అప్యాయతా,ప్రేమ చూపించండి అని లతా చివరి మాటలు అంటూ చెప్పిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -