- Advertisement -
టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గని’ మూవీలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్‌ను తెచ్చుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో, తెలుగు తెరకి కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయమవుతోంది.
ఇక ఈ సినిమాలో వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు. ఇందులో గెస్ట్ రోల్స్‌లో సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో నదియా కనిపించనున్నారు. డిసెంబర్ లోనే విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖాయం చేయనున్నారు.
- Advertisement -