- Advertisement -
ముచ్చింతల్‌లో కొలువైయున్న సమతా మూర్తిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్, శంషాబాద్ సమీపంలో, శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరికి చినజీయర్ స్వామితోపాటు వేద పండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ పరిసరాల్లోని దేవాలయాలను పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు ఆయన సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో శ్రీ చినజీయర్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వార్లు నిర్వహించిన యాగం లో పాల్గొన్నారు.

- Advertisement -

