14 నెలలు..78 సార్లు కోవిడ్!

86
corona
- Advertisement -

ఒకే వ్యక్తికి ఏకంగా 78 సార్లు కోవిడ్ పాజిటివ్‌గా తేలంది. దీంతో కోవిడ్ దెబ్బకు 14 నెలలుగా హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు ఆ వ్యక్తి. టర్కీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

లుకేమియా రోగి అయిన ముజాఫర్ కయాసన్‌కు నవంబర్ 2020లో మొదటిసారిగా కోవిడ్ వైరస్ సోకింది. దాంతో ఆస్పత్రిలో చేరాడు. రెండు వారాల తర్వాత డిశ్చార్జ్ అయి ఇస్తాంబుల్‌లోని సరియర్ జిల్లాలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే కొన్ని రోజులకే మళ్లీ టెస్ట్ పాజిటివ్ అనే వచ్చింది. చేసేదేం లేక మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత చాలాసార్లు టెస్ట్ చేయించగా ఫలితం మాత్రం పాజిటివ్‌ అనే వచ్చింది.

ఇలా పలుమార్లు టెస్టులు చేయగా పాజిటివ్‌గానే తేలడంతో 14 నెలలుగా ఐసోలేషన్‌లోనే ఉంటూ అవస్థలు పడుతున్నాడు. ఇంట్లో వాళ్లను కలుసుకోలేక, బంధువులు, స్నేహితులతో మాట్లాడే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నాడు.

- Advertisement -