- Advertisement -
కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్ మళ్లీ తిరిగి ప్రారంభంకానుంది. ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని…మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ జరగనుండగా స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా జనవరి 1న గవర్నర్ తమిళిసై ప్రారంభించిన నుమాయిష్ మరుసటి రోజే కరోనా నిబంధనల కారణంగా మూతపడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నుమాయిష్‌ను అర్ధాంతరంగా అధికారులు నిలిపివేశారు.
- Advertisement -

