- Advertisement -
తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు. కరోనా సమయంలో ట్రంప్‌ను తీసుకొచ్చి గుజరాత్‌లో మీటింగ్ పెట్టినప్పుడు రాని కరోనా…వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తే వచ్చిందనడం సిగ్గుచేటన్నారు.
ప్రధానికి వలస కార్మికులంటే ఎందుకు చిన్నచూపో చెప్పాలన్నారు. కరోనా సమయంలో వలస కార్మికులను కేంద్రం పట్టించుకోపోయినా రాష్ట్ర ప్రభుత్వం వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ్యాన్ని కించపరిచే విధంగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని..అమరుల త్యాగాలను చిన్నచేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -