సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలన్నారు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన తమ్మారెడ్డి..సమస్యల పరిష్కారం కోసం మంత్రులను వినతిపత్రం సమర్పించామన్నారు. ఆన్లైన్ విధానంలో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించాలని…అప్పుడు నిర్మాతకు డబ్బులు వస్తాయన్నారు.
ఇంగ్లీషు, హిందీ సినిమాలకు క్యూబ్ వంటి సంస్థలు ఛార్జ్ చేయరు. తెలుగు, చిన్న సినిమాల వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు. దాంతో నష్టం వస్తుందని ఆయన వెల్లడించారు. ట్రాన్స్ ఫర్ ఛార్జీ కూడా తీసుకుంటున్నారని, టిక్కెట్ రేట్లు అనేది చాలా చిన్న ఇష్యూ అని ఆయన అన్నారు. చిన్న సినిమాలకు ఏపీలో సబ్సిడీలు ఇవ్వాలన్నారు.
తెలంగాణలో లొకేషన్ ఛార్జీలు తీసేయాలని, మినీ థియేటర్లు ఎక్కువగా రావాల్సి ఉందన్నారు. టికెట్ రేట్లు పెంచితే డబ్బులు ఎక్కువ వస్తాయనుకోవడం భ్రమేనన్నారు.