- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో 24 గంటల్లో 71,365 కరోనా కేసులు నమోదుకాగా 1217 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కు చేరగా 5,05,279 మంది బాధితులు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 8,92,828 కేసులు యాక్టివ్గా ఉండగా 4,10,12,869 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతానికి చేరగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,70,87,06,705 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -