MS ధోని క్రికెట్ అకాడమీని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి..

66
- Advertisement -

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమన్నారు మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఎమ్మెస్ ధోని క్రికెట్ అకాడమీని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిపిఎస్ చైర్మన్ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడలలో నంబర్ వన్ ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో ధోని క్రికెట్ అకాడమీతో కలిసి పని చేయడం శుభపరిణామన్నారు మంత్రి. గొప్ప కోచ్ లతో ఈ అకాడమీ ఏర్పాటైందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధోని స్పూర్తితో పెద్ద ఆటగాళ్లు కావాలన్నారు. ప్రపంచంలో ఏ రంగంలోనైనా తెలంగాణ విద్యార్థులు నంబర్ వన్‌గా ఉండాలని మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు.

- Advertisement -