అరెస్ట్ చేసిన ఉద్యోగులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా తరలివచ్చారన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను ఉద్యోగస్తులు విజయవంతం చేశారన్నారు.
రేపు మరలా సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాం అని తెలిపిన బండి శ్రీనివాసరావు…పోలీసుల హెచ్చరికల వలన మేము ఛలో విజయవాడకు వచ్చిన ఉద్యోగులకు ఏర్పాట్లు చేయలేకపోయాం అన్నారు. ప్రజలు స్వచ్చంధంగా మంచినీరు, ఆహారం అందించారు…కొన్ని చోట్ల పోలీసులు మాకు సహకరించారు.. వారికి ధన్యవాదాలు చెప్పారు.
సిఎస్, సజ్జల.. చర్చల ద్వారా పరిష్కరిద్దామని అంటున్నారు…సీఎస్, సజ్జల మాటలపై రేపు స్టీరింగ్ కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలని….ఉద్యోగస్తుల ఆశలను ఆవిరి చేయం అన్నారు. సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాడతాం అన్నారు.