వైద్య రంగంలో ‌గుణాత్మక మార్పులు తెచ్చాం- మంత్రి హరీష్‌

73
harish
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కాని 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంది‌. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డాం. ఈ పరిస్థితి గమనించిన ‌సీఎం కేసీఆర్ 500 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు.

ప్రస్తుతం‌ 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్నాం. మరో200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం. త్వరలో ఇది ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 27 వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదు.‌ వైద్య రంగంలో‌గుణాత్మక మార్పులు తెచ్చాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు‌ చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాలు ఇస్తోంది.

రెండం, మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గింది. అయినా అలసత్వం వద్దు. అందరం మాస్క్ ధరిద్దాం, వాక్సిన్ వేయించుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న ఆయన తొలి స్థానంలో నిలవాలన్నారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అభివృధ్ది చేస్తామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌ రావు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ని‌‌సందర్శిచారు. అన్ని వార్డులను కలియ తిరిగారు.

ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు‌చేస్తామన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో‌ డెలివరీలు పెరిగాయాన్నారు. ప్రస్తుతం‌ 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని‌ 75 శాతంకు పెంచాలన్నారు. జహీరాబాద్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్‌ డెలివరీలు బాగా జరుగుతున్నాయన్న మంత్రి ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు.

అనవసరంగా సెక్షన్ సర్జరీలు చేయవద్దన్నారు. దీని వల్ల‌ తొలి‌గంటలో శిశువుకు‌అందాల్సిన అమృతమైన పాలు అందడం లేదన్నారు. దీని వల్ల‌ శిశువులో రోగ నిరోథక శక్తి తగ్గిపోతుందన్నారు. దాదాపు మన రాష్ట్రంలో‌ ఇలా‌ 66 శాతం మంది‌ శిశువలకు తొలి‌గంటలో పాలు అందడం‌ లేదన్నారు. ఈ అనవసర సర్జరీల వల్ల‌ 35 ఏళ్లకే తల్లి ఆ రోగ్యం దెబ్బతింటుందన్నారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌ కింద ఏరియా ఆస్పత్రిలో‌ చికిత్సలు చేయాలని మంత్రి ఆదేశించారు.

డిపార్ట్మెంట్ల వారీగా పని తీరును అడిగి‌ తెలుసుకున్నారు. మందుల‌ కొరత, నిధుల‌ కొరత ప్రభుత్వం రానివ్వదని, చక్కటి‌ వైద్యం పేదలకు అందించాలని సిబ్బందికి‌ మంత్రి ‌సూచించారు. రోగులను ప్రేమగా పలకరించాలని, మర్యాదగా వ్యవహరించాలన్నారు. వృత్తిని, ఉద్యోగ ధర్మాన్ని మరువవద్దని చెప్పారు మంత్రి హరీష్‌.

- Advertisement -