- Advertisement -
సిక్కోలు చిన్నారికి విశిష్ట గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక రాష్ట్రీయ బాల పురష్కార్ కు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుగు హిమప్రియ అనే చిన్నారి ఎంపికయ్యింది. 2018లో జమ్మూలోని ఆర్మీ క్వార్ట్రర్స్ పై జరిగిన ఉగ్రదాడిలో దైర్యసాహసాలను ప్రదర్శించినందుకుగానూ భారత ప్రభుత్వం హిమప్రియను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి వర్చ్యువల్ విధానంలో హిమప్రియ ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా అవార్డును అందుకుంది. మొత్తం 29 మందికి ఈ అవార్డు దక్కగా ఆంధ్రప్రదేశ్ నుంచి హిమప్రియ ఒక్కరే ఈ పురష్కారానికి ఎంపిక కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -