జగన్ పాలనపై కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు..

44
- Advertisement -

జగన్ పాలనకు వచ్చినప్పటి నుండి హిందూ సమాజాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కర్నూలులో జరుగుతున్న బిజెపి సమావేశాన్ని గుంటూరు శ్రీ లక్ష్మి ధియేటర్ వర్చువల్ విధానంలో ఆయన వీక్షించారు. పార్టీ కార్యకర్తలు సమావేశాన్ని తిలకించారు. హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా అనుమతి లేకుండా మసీదు నిర్మాణం చేపట్టారన్నారు. దానిపై మాట్లాడేందుకు వెళ్లిన జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై పిఎస్ఐ ఆధ్వర్యంలో దాడి చేశారన్నారు.

బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఆయనన్ను విడుదల చేసేంత వరకూ ఆందోళన కొనసాగుతుందన్నారు కన్నా. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తప్ప మరొకటి ఉండకూడదని భావిస్తున్నారన్నారు. ఆ కంపెనీ ఆధ్వర్యంలోనే పేకాట క్లబ్ ల నిర్వహణ, మద్యం అమ్ముకోవటం, సినిమా టికెట్స్, విక్రయించడం, మాంసం దుకాణాల నిర్వహణ చేస్తున్నారన్నారు. ఇటువంటి పాలన అవసరమా అన్న విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఉద్యోగుల చేస్తున్న ఉద్యమానికి అండగా ఉంటామన్నారు కన్నా లక్ష్మీ నారాయణ.

- Advertisement -