సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ జూబ్లీహిల్స్ డివిజన్‌లోని కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ రెవెన్యూ అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా పాదయాత్ర నిర్వహించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలు తెలుసుకుంటూ వాటిని సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యలను సత్వరమే పరిష్కారించాలని ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే దానం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్‌లో 1 కోటి 50 లక్షల రూపాయలు సివారేజ్ పనుల కోసం మంజూరు అయ్యాయని, అదేవిధంగా సిసి రోడ్ల కోసం మరో 1 కోటి 50 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని అన్నారు. తొందరలోనే వీటికి సంబంధించిన పనులను ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.