మొక్కలు నాటిన గృహాలక్ష్మి నటి పూజిత రెడ్డి..

87
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు గృహాలక్ష్మి సీరియల్ నటి పూజిత రెడ్డి. ఈ సందర్భంగా పూజితరెడ్డి మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

హైదరాబాద్ చుట్టుపక్కల రోజురోజుకు గ్రీనరి పెరుగుతుందని పర్యవరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.అనంతరం గ్రీన్ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా గృహాలక్ష్మి సీరియల్ నటీనటులు వెంకట్, కనకదుర్గ,అవినాష్ ముగ్గురికి చాలెంజ్ విసిరారు.

- Advertisement -