కరోనా వ్యాప్తి.. రైల్వే ముందస్తు చర్యలు..

169
- Advertisement -

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సంక్రాంతి పండుగ సందర్బంగా భారీగా ప్రయాణికుల రద్దీ నెలకొన్న దృష్ట్యా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి దక్షిణ మధ్య రైల్వే అనేక ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ముందస్తు చర్యలన్నింటినీ ప్రయాణికులు తప్పకుండా పాటించాలని మరియు రైల్వే పాలనా విభాగ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని అధికారులు తెలిపారు.

ముందస్తు చర్యలు:

1.స్టేషన్లలో ప్లాట్‌ఫారాలపై రద్దీని నియంత్రించడానికి ప్రయాణికులను వారి రైలు బయులుదేరే సమయానికి రెండు గంటల ముందుగా మాత్రమే స్టేషన్‌లోని అనుమతిస్తారు.

2.చెల్లుబాటుగల ప్రయాణి టిక్కెట్లు/ప్లాట్‌ఫారం టిక్కెట్లు కలిగున్న ప్రయాణికులను స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ప్రయాణికులు రైళ్లు ఎక్కే సమయంలో భౌతిక దూరం పాటించేలా కమర్షియల్‌ విభాగం సిబ్బందికి ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది తోడ్పాటు అందిస్తారు.

3.ఆర్‌పిఎఫ్‌ సిబ్బందిచే ప్రయాణికులకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించబడుతుంది.

4.కోవిడ్‌ వ్యాప్తి నివారణకు స్టేషన్‌ పరిసరాలలో శానిటైజింగ్‌ మరియు పరిశుభ్రతకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అన్ని చర్యలు తీసుకుంటున్నది.

5.ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు కాని వారిని తగ్గించడానికి సికింద్రాబాద్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్టు ధరను ప్రస్తుత ధర రూ.10 నుండి రూ.50 పెంచబడిరది.

6.మాస్కులు ధరించని ప్రయణికులు ప్లాట్‌ఫారాలపై ఉన్న స్టాల్స్‌లో లభించే మాస్కులు కొనుగోలు చేయాలని రైల్వే బృందాలు సూచిస్తాయి.

7.ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా మరియు మాస్కులు ధరించేలా పర్యవేక్షణకు స్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు ప్రయాణించే రైలు కోచుల వద్దకి వెళ్లి ప్రయాణికులకు సూచనలు ఇస్తారు.

8.రైల్వే పరిసరాలలో అందరూ తప్పకుండా ముఖానికి మాస్కులు ధరించాలి, లేనిచో భారతీయ రైల్వే చట్టం 2012 (రైల్వే పరిసరాలలో పరిశుభ్రత ఉల్లంఘనకు జరిమానా) ప్రకారం (రూ.500 వరకు) జరిమానా విధించబడుతుంది.

9.స్టేషన్లలో కోవిడ్‌ సంబంధించిన భద్రతా నిబంధనలను పాటించేలా మరియు వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలపై ప్రయానికుల కోసం నిరంతరం ప్రకటనలు ఇస్తున్నారు.

10.స్టేషన్లలో కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు పరిచేలా సికింద్రాబాద్‌ స్టేషన్‌లో 10.01.2022 మరియు 11.01.2022 తేదీలో కమర్షియల్‌ విభాగం వారిచే విస్తృతంగా తనిఖీలు నిర్వహించబడినాయి. మాస్కులు ధరించని ప్రయాణికులకు జరిమానా విధించబడిరది. నిబంధనలు ఉల్లఘించిన వారిని గుర్తించి మొత్తం 169 కేసులు నమోదు చేసి వారి నుండి రూ.34,100 జరిమానాగా వసూలు చేయబడిరది.

11.పండుగ సందర్భంగా ప్లాట్‌ఫారాలపై నెలకొనే రద్దీ దృష్ట్యా 2022 జనవరి 12వ తేదీ నుండి 21 తేదీ వరకు దిగువ మూడు రైళ్ల ప్లాట్‌ఫారాలు మార్చబడినాయి.
ఏ) ట్రెయిన్‌ నెం. 12728 హైదరాబాద్‌విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫారం నెం.10 నుండి (ప్లాట్‌ఫారం నెం. 1 బదులు) 17.10/17.15 గంటలకు బయలుదేరుతుంది. బి) ట్రెయిన్‌ నెం.12738 లింగంపల్లికాకినాడ పోర్ట్‌ గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫారం నెం. 10 నుండి (ప్లాట్‌ఫారం నెం. 1 బదులు) 21.10/21.15 గంటలకు బయలదేరుతుంది.
సి) ట్రెయిన్‌ నెం.22692 హజ్రత్‌ నిజాముద్దీన్‌`బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫారం నెం.1 నుండి (ప్లాట్‌ఫారం నెం. 10బదులు) 17.20 / 17.25 గంటలకు బయలదేరుతుంది.

కాగా, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ఫారంపై రద్దీ నివారణకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రెయిన్‌ నెం.12728) మరియు గౌతమి ఎక్స్‌ప్రెస్‌ (ట్రెయిన్‌ నెం.12738) ప్లాట్‌ఫారం నెం.10 నుండి (ప్లాట్‌ఫారం నెం.1 బదులు) బయలుదేరుతాయి.హజ్రత్‌ నిజాముద్దీన్‌`బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (ట్రెయిన్‌ నెం.22692) ప్లాట్‌ఫారం నెం.1 నుండి (ప్లాట్‌ఫారం నెం. 10 బదులు) బయలు దేరుతుందని అధికారులు తెలిపారు.

- Advertisement -