సీఎం కేసీఆర్‌తో ఆర్‌జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ భేటీ..

103
- Advertisement -

ఆర్‌జేడీ నేత, బిహార్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావుతో భేటి అయ్యారు. మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో తేజ‌స్వీ యాద‌వ్ నేతృత్వంలోని పార్టీ ప్ర‌తినిధుల బృందం సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసింది. ఈ భేటిలో జాతీయ రాజ‌కీయాలు, రాష్ట్రంలో అమ‌ల‌వుతున్నప‌థ‌కాల గురించి ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్లుగా స‌మాచారం. ఈ భేటీలో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తార‌క రామారావు, ఆర్‌జేడీ నుంచి మాజీ మంత్రి అబ్దుల్ భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్‌, మాజీ ఎమ్మెల్యే భోలా యాద‌వ్ పాల్గొన్నారు.

- Advertisement -