రైతు బంధు ఉత్సవాల్లో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం..

222
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఈ రోజు రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా…వెంకిర్యాల గ్రామం నుండి భారీగా ట్రాక్టర్ ర్యాలీతో బయలుదేరి పల్లె గూడెం, రుద్రవెల్లి, రాఘవపురం, చిన్న రావులపల్లి, బ్రాహ్మణపల్లి మరియు బీబీనగర్ పోచంపల్లి చౌరస్తా వద్దకు ర్యాలీ నిర్వహిస్తూ సుమారు 17 కిలోమీటర్లు ట్రాక్టర్ నడిపిస్తూ కార్యకర్తల్లో, రైతుల్లో ఉత్సాహాన్ని నెలకొల్పుతూ బీబీనగర్ చౌరస్తాలో సీఎం
కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం పండగలా మారిందని, ఈ నెల 10 నాటికి రైతు బంధు పథకం కింద అన్నదాత ఖాతాలోకి 50 వేల కోట్లు జమ కానున్నాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ పల్లెలు నేడు ఆర్థిక పరిపుష్టి సాధించామని పేర్కొన్నారు. 70 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో రైతులకు పెట్టుబడి సాయం చేయాలని ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు.. ఏ ప్రధానమంత్రి మనసుకూ తట్టలేదన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున అందించి రైతన్నకు రైతు బాంధవుడయ్యారు.

రైతు చనిపోతే వాళ్ల కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బంది పడేవారు. అలాంటి కుటుంబాలకు అండగా ఉండటానికి రైతుబీమా పథకంతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు కేసీఆర్. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు పెట్టుబడి సాయం అందిస్తున్న మనసున్న మనిషి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అభినందించారు. రైతు పథకం మొదలైన దగ్గరినుంచి అన్నదాతకు వానకాలం, యాసంగి పంటకు ఆర్థిక సహాయం అందుతూనే ఉన్నది. రైతుకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు ఉంచడంతో పాటు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. అదే విధంగా, 2,601 రైతు వేదికలు నిర్మించి ఎప్పటికప్పుడు రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు ఇప్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -