తిరుమల వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని రామచంద్రపుష్కరిణి, ముత్యాలరెడ్డి పల్లె, సత్యనారాయణ పురం జిల్లా పరిషత్ పాఠశాలలు, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను శనివారం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామన్నారు. టికెట్ల కోసం వచ్చే భక్తులు క్యూ లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. టికెట్లు పొందిన భక్తులు ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మాత్రమే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతిస్తామని చెప్పారు.
10న వైకుంఠ ద్వార దర్శనానికి ఉచిత టికెట్ల జారీ- టీటీడీ
- Advertisement -
- Advertisement -