భారీ రేటుకు ‘పుష్ప’ను దక్కించుకున్న అమెజాన్‌..

187
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. గత ఏడాది డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. మంచి వసూళ్లను రాబట్టింది. ఇక, ఆ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 7 నుంచి సినిమా స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది.

ఇక, ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. రూ.27 కోట్ల నుంచి రూ.30 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. నాలుగు భాషల్లో అభిమానుల కోసం సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో సినిమా అందుబాటులోకి రానుంది.

కాగా,పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అతి తక్కువ సమయంలోనే 300 కోట్ల ట్రేడ్ మార్క్‏ను దాటేసి విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్.. నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

- Advertisement -