రైతుబంధు అద్భుతం- ఎమ్మెల్యే శంకర్ నాయక్

18

గురువారం మహబూబాబాద్ మండలం వేమునూర్ గ్రామంలో మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ రైతులతో కలిసి రైతుబంధు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా ఆయన సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ నామాన్ని కరిగట్టు పొలంలో వరి నారుతో నాటు వేసి రూపొందించారు. అనంతరం మహిళ రైతులతో కలిసి గిరిజన భాషలో పాటలు పాడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాటు వేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేను రైతు కుటుంబంలో పుట్టాను రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు పెట్టారు అని దానిలో అద్భుతమైన పథకము రైతు బంధు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయిని రంజిత్, సూదగని మురళి, యాస వెంకట్ రెడ్డి, అశోక్, షరీఫ్, వెంకన్న, కిషన్, సర్పంచులు, ఎంపిటిసిలు మరియు తదితరులు ఉన్నారు.