- Advertisement -
తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాలిమై. ఈ సినిమా ప్రారంభమైన దగ్గరి నుండి అప్‌డేట్ కోసం ఎంతగానో ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్ ట్రీట్ ఇచ్చారు. ఈ సంక్రాంతి కానుకగా వాలిమై విడుదల కానున్నట్లు ప్రకటించారు.
జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా అజిత్ వాలిమై ప్రేక్షకుల ముందుకురానుందని వెల్లడించారు. తమిళ్‌తో పాటు తెలుగు,హిందీలో వాలిమై రిలీజ్ కానుంది. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, టాలీవుడ్ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.
- Advertisement -