గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఘన విజయం సాదించిన తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటివరకు సినిమాలను ప్రారంభించలేదు. బాలకృష్ణ కోసం పలువురు దర్శకులు ముందుకి వచ్చినా బాలకృష్ణ వారికి ఓకే చెప్పలేదు. తొలుత కెఎస్ రవికుమార్ కథకి ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చిన బాలయ్య మాత్రం పూరికే అవకాశం ఇచ్చాడు. ఎప్పటి నుంచో బాలకృష్ణ అభిమానులు కుడా ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తూన్నారు.దీనితో ఈ సినిమాని బాలకృష్ణ అంగీకరించడం తో పూరి జగన్నాథ్ అధికారికం గా ప్రకటించేశారు.ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యుల్ ఈ నెల 16 నుంచి మొదలు కానుంది.
ఈ సినిమా రేపు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ తో పాటు లండన్ .. స్పెయిన్ లోను ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. బాలకృష్ణ రూట్ వేరు .. పూరీ స్కూల్ వేరు. బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా .. భారీ స్థాయిలో ఉంటుంది. పూరీ సినిమాల్లో హీరో సాధారణమైన కుర్రాడిగా కనిపిస్తుంటాడు. అందువలన వీళ్ల కాంబినేషన్ పై అంతా ఆసక్తిగా వున్నారు. ఎలాంటి కథతో రానున్నారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
పూరి సినిమా అంటే పక్కా ప్లానింగుతో ఉంటుంది. అనుకున్న సమయానికి షూటింగ్ మొదలు పెట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటన పూరి అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తాడనే నమ్మకంతోనే నిర్మాత ఏకంగా చిత్రం రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. ఈఏడాది సెప్టెంబర్ 29న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
https://twitter.com/purijagan/status/835108270838730752