చోళ మ‌హారాజుగా అజిత్‌?

239
Ajith to play a king in Vishnuvardhan's next film ?
- Advertisement -

అజిత్, విష్ణువర్ధన్ కాంబోలో చారిత్రాత్మక సినిమా తెరకెక్కనుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, దర్శకుడు విష్ణువర్ధన్‌ల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో బిల్లా, ఆరంభం వంటి హిట్ సినిమాలు తెరకెక్కాయి. తాజాగా అజిత్, విష్ణువర్ధన్ మూడోసారి కలసి ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. చారిత్రక కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ పాత్రలో అజిత్ నటించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే వెండితెరపై గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి  సినిమాతో శాత‌వాహ‌నుల ఘ‌న‌కీర్తి ఏపాటిదో తెలుసుకున్నారం. శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు. అయితే ఈ సినిమా ఇన్ స్పయిర్ చేసిందో లేక యాథృచ్చికంగా రాసుకున్నదో తెలియదు కానీ ప్రస్తుతం తమిళనాట చోళ మహారాజుల వీరత్వం, చోళ సామ్రాజ్యంపైన దర్శకుడు  విష్ణువ‌ర్ధ‌న్‌ క‌థ రాసుకుని స్టార్ హీరో అజిత్‌కి వినిపించాడుట‌. చోళ రాజ్యానికి త‌మిళ‌నాడుతో ఉన్న లింకును ఈ సినిమాలో చూపిస్తారుట‌. త‌ళా ఈ స్క్రిప్టుకి ఇంకా ఓకే చెప్పాడో లేదో కానీ అజిత్ ఈ సినిమాలో నటిస్తున్నాడన్న వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక ప్రస్తుతం అజిత్ త‌న కెరీర్ 57వ సినిమా `వివేగం`లో న‌టిస్తున్నాడు.

100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి  ‘బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్’ అనేది ట్యాగ్‌లైన్ తగిలించారు.  శివ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘కాజల్’, ‘అక్షర హాసన్’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 10న గానీ 11వ తేదీన గాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

- Advertisement -