ఏపీ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ, నివారణ వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై సూచనలు జారీ చేశారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణశ్రీనివాస్ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరైయ్యారు.
కోవిడ్ నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష..
- Advertisement -
- Advertisement -