శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ టీజర్‌ అప్పుడే..!

91
- Advertisement -

టాలీవుడ్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా రూపొందుతోన్న మూవీ ఒకే ఒక జీవితం. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్‌ 29 సాయంత్రం 5గంటలకు ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీనిక సంబంధించిన పోస్ట్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌లో వెన్నెల కిషోర్‌,శర్వానంద్‌,ప్రియదర్శి ఓ ఉయ్యాలపై కూర్చుని ఉన్నారు. ఈ పోస్టర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతున్నాయి.

తెలుగమ్మాయి రీతూ వర్మ ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ చిత్రంలో భాగం అయ్యారు. శర్వానంద్‌కు క్రేజ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌ను ఆకట్టుకునేలా ఉండబోతోంది.

- Advertisement -