అరుణ రెడ్డికి కియా కారు బహుమతి

184
chiru
- Advertisement -

ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన నగరానికి చెందిన బుద్ధ అరుణ రెడ్డి కి బ్యాడ్మింటన్ కోచ్ అసోసియేషన్ అధ్యక్షుడు కియా కార్ ను అందజేశారు. బుధవారం జూబ్లీహిల్స్లోని నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కారు తాళాలు అందజేశారు.

చాముండేశ్వరి నాథ్ మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికపై భారతదేశ సత్తా చాటిన అరుణ రెడ్డి ని మరింత ప్రోత్సహించేందుకే బహుమతి అందజేసినట్లు తెలిపారు.క్రీడాకారుని అరుణ మాట్లాడుతూ జిమ్నాస్టిక్ విభాగంలో రెండు స్వర్ణ పథకాలను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మరింత ప్రోత్సాహం లభిస్తే రానున్న కామన్వెల్త్ క్రీడల్లో మువ్వన్నెల పతాకాన్ని అత్యన్నత స్థాయిలో నిలిపుతానని అన్నారు.

- Advertisement -