రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కొకపేట్‌లో తన నివాస ప్రాంగణంలో అపార్ట్మెంట్ వాసులతో కలిసి బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్‌లో ఉండగా నాగార్జున,ఎంపీ సంతోష్ కుమార్ కలిసి హౌజ్‌లో మొక్క నాటారు.. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని హౌజ్ నుండి బయటికి వచ్చాక మా ఇంటిముందు మొక్కలు నాటనని మానస్ తెలిపారు.
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ ఛాలెంజ్‌లో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు నేను ఈ రోజు పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని మానస్ అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని మానస్ పిలుపునిచ్చారు. అనంతరం ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా హీరో సందీప్ కిషన్,హీరోయిన్స్ అక్షత సొనావనే,సనమ్ శెట్టి ముగ్గురికి చాలెంజ్ విసిరాడు.