ఆలోచింప‌జేసే డైలాగుతో ‘గాడ్సే’ టీజ‌ర్..

117
- Advertisement -

దర్శకుడు గోపీ గణేశ్‌, హీరో సత్యదేవ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం గాడ్సే. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. హీరో సత్యదేవ్‌తో పాటు దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కల్యాణ్ లను చిరంజీవి అభినందించారు. గాడ్సే పాత్ర‌లో స‌త్య న‌టించాడు.

‘ఏ నినాదం వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్ర‌జ‌లు మోస‌పోతూనే ఉంటారు’ అనే డైలాగుతో టీజ‌ర్ మొదలౌతుంది. గాడ్సే కోసం పోలీసులు గాలిస్తున్న‌ట్లు టీజ‌ర్‌లో చూపించారు. గాడ్సే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? గాడ్సే అస‌లు పేరు ఏంటీ? ఇక్క‌డ ఏం జ‌రుగుతుందో నాకు తెలియాలి? అంటూ ఐశ్వర్య లక్ష్మి విచారణ అధికారిణి హోదాలో ప్ర‌శ్నిస్తోంది.

‘సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి.. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి.. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు ఎలా వస్తున్నారా? ఎందుకంటే మీరంతా సేవ‌ల‌ పేరుతో ప్ర‌జ‌ల డ‌బ్బును కొల్ల‌గొడుతున్నారు’ అంటూ సత్యదేవ్ చెబుతోన్న డైలాగు అదుర్స్ అనిపిస్తోంది. అద్భుత‌మైన మ్యూజిక్‌ను జోడిస్తూ ఈ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో సత్య తుపాకులు ప‌ట్టుకుని పోరాడుతోన్న సీన్ల‌ను చూపించారు. అందరినీ ఆకట్టుకునేలా టీజ‌ర్ క‌ట్ చేశారు. మైండ్‌ గేమ్‌ తరహాలో ఈ సినిమా క‌థ కొన‌సాగుతుందని ఈ టీజ‌ర్ ద్వారా అర్థ‌మ‌వుతోంది. సామాజిక అంశాల ఆధారంగా ఈ ‘గాడ్సే’ క‌థ రాసుకున్న‌ట్లు తెలుస్తోంది.

https://youtu.be/z7KX3z3O7g4
- Advertisement -