క్రిస్మస్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని..

26

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో ఎల్.బి స్టేడియంలో అధికారికంగా నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను నగర ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు.ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలలో ముఖ్యమంత్రి, పలువురు క్రైస్తవ ప్రముఖులతో కలిసి పాల్గొంటారు.