తీన్మార్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు..

170
teenmaar mallanna
- Advertisement -

ఈర గోల ను కించపరిచే విధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడటం సరికాదని తెరాస సీనియర్ నాయకుడు మానుక్ రాజు యాదవ్ అన్నారు. తమ కుల దైవం మల్లన్న స్వామి కి ఎంతో ఇష్టమైన ఈర గోల నున్యెక్కడ పడితే అక్కడ వాడత అనడం సరికాదను అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి వద్ద వోగ్గు పూజారి సాయి ఉప్పలయ్య, అశోక్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని యాదవులు అత్యంత భక్తి తో ఈర గోల తో దేవుడిని పూజిస్తారు అని అటువంటి ఈరగొల ను రాజకీయాల్లోకి తెచ్చి తెరాస ముఖ్యమంత్రి కెసిఆర్ నీ ఇతర నేతలని అమర వీరుల స్థూపానికి కట్టి కొడతామని అనడం తప్పని అన్నారు. ఢిల్లీ లో బీజేపీ లో చేరిన సందర్భంగా తీన్మార్ మల్లన్న యాదవులు పూజించే ఈర గోల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని తీన్మార్ మల్లన్న బహిరంగంగా యాదవులు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై డీజీపీ కి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు…

- Advertisement -