తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల..

194
gangula
- Advertisement -

తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ‌ సమయంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ భానుప్రసాద్ రావు,ఎమ్మెల్యే వివేక్ గౌడ్,ఎమ్మెల్సీలు కేకే మహేంద్రరెడ్డి, డిఎల్.రవీంద్రలు వేరువేరుగా స్వామి వారిని సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

అనంతరం ఆలయం వెలుపల మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ…శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ నాయకులతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలిపారు..స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో కొత్త రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాంమని, రాబోయే కాలంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ యాదాద్రిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అలాగే కేసీఆర్ యాదాద్రి ఆలయం కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -